
జయశంకర్ భూపాలపల్లి, 27 అక్టోబర్ (హి.స.)
భూపాలపల్లి జిల్లా అడవి ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మల్హర్, కాటారం మహదేవాపూర్ మండలంలో చిరుతపులి సంచరిస్తుందనిస్తుందని గ్రామస్తులు అడవిలోకి ఎవరు వెళ్లకూడదని సాధు జంతువులను మేకలను, ఆవులను అడవుల్లోకి తీసుకు వెళ్లరాదని, జంతువుల పై, మనుషుల పై దాడి చేసే అవకాశాలు ఉందని జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రెండు రోజుల క్రితం మహాముత్తారం మండలంలోని పర్ల పెల్లి జీలపల్లి, గ్రామంలో చిరుతపులి గొర్రెల పై దాడి చేసింది. అంతేగాక అడవి ప్రాంతంలో చిరుతపులి అడుగుజాడలను అటవిశాఖ అధికారి గుర్తించి అవి పులి అడుగుజాడలేనని పత్రిక ప్రకటనలు విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు