
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 7, 2026న ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ అనేక దశల్లో పూర్తవుతుంది.
ఇప్పటివరకు, దేశం 1951, 2004 మధ్య ఎనిమిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ (SIRs) నిర్వహించింది. రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితాల నాణ్యత సమస్యను లేవనెత్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. కాగా బీహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన SIR ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. దాదాపు 74.2 మిలియన్ల పేర్లతో కూడిన తుది జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించారు. బీహార్‌లో పోలింగ్ నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరుగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.
..
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు