ఆంధ్ర తీరం దిశగా దూసుకువస్తోన్న 'మొంథా' తుఫాను
విశాఖపట్నo,, 27 అక్టోబర్ (హి.స.) ఆంధ్ర తీరం దిశగా ''మొంథా'' తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం, తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది.. పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ.. ది
విశాఖపట్నo,


విశాఖపట్నo,, 27 అక్టోబర్ (హి.స.) ఆంధ్ర తీరం దిశగా 'మొంథా' తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం, తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది.. పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ.. దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా కదలడం మొదలైంది.

ఈ వాయుగుండం గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇప్పటికిది తూర్పు ఆగ్నేయంగా , చెన్నైకి 680, దక్షిణాగ్నేయంగా కాకినాడకు 600 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande