మొంథా తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.) నెల్లూరు: మొంథా తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరుగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి రోడ్డుపై పడ్డాయి. నెల్లూరు రూరల్ మండలం ములుమూడి కలుసు
మొంథా తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం


అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)

నెల్లూరు: మొంథా తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరుగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి రోడ్డుపై పడ్డాయి. నెల్లూరు రూరల్ మండలం ములుమూడి కలుసు వద్ద, కందుకూరు దగ్గర ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కలిగిరి - సంగం మార్గంలో కమ్మవారిపాలెం సమీపంలో చట్టాపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండల పరిధిలోని తుమ్మలపెంట సముద్రతీరం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande