
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)
మొంథా తుపాన ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో జోరు వానలకు గంభీరం రిజర్వాయర్ వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో సందర్శకులు రిజర్వాయర్ వద్దకు వెళ్లొద్దని, స్థానికులు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ