
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)
మొంథా తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జోరువానల కారణంగా శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. వెదుర్లగడ్డ వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కంచంగి, రొంగనివానిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యలమంచిలి నియోజకవర్గంలో శారదా నది.. మండలం కొత్తూరు వద్ద వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ