
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)బీహార్ ఒపీనియన్ పోల్‌లో హోరాహోరీ పోటీ తప్పదని తేలింది. రెండు కూటముల మధ్య టఫ్ ఫైల్ ఉన్నప్పటికీ, ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం వస్తుందని జేవీసీ పోల్ అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని, మహాఘటబంధన్ కూటమికి 93-112 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని చెప్పింది.
243 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ 70 నుంచి 81 సీట్లు గెలుచుకుంటుందని, జేడీయూ 42 నుంచి 48 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఎల్జేపీ(రామ్ విలాస్) 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, హెచ్ఏఎం(ఎస్) 2 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది.
ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమిలో ఆర్జేడీ 69 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 9-17 సీట్లు గెలుచుకుంటుందని, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి 14 నుంచి 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కేవలం ఒక స్థానానికి పరిమితమవుతుందని సర్వే చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు