దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)ఢిల్లీ పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పె రిగింది. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయ
Amit Shah


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)ఢిల్లీ పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పె

రిగింది. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి నగరాలు పురాతన గుర్తింపులు పొందాయని.. అలాగే తిరిగి ఢిల్లీని కూడా అసలు రూపంలో గౌరవించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పురాతన మూలాలను గుర్తు చేస్తూ.. దేశ రాజధాని పేరును ‘‘ఇంద్రప్రస్థ’’గా మార్చాలని లేఖ కోరారు. ‘‘ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. భారతీయ నాగరికత యొక్క ఆత్మను, పాండవులు స్థాపించిన ‘ఇంద్రప్రస్థ’ నగరం.’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే దేశ రాజధానిలో పాండవుల గొప్ప విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande