
రాయపుర్, 1 నవంబర్ (హి.స.): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించిన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నవ రాయపుర్ లో నూతనంగా నిర్మించిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ భవంతిని ప్రధానమంత్రి శనివారంనాడు ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి జర్నీలో స్వర్ణయుగానికి ఇది ప్రారంభమని ఆ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
ABN ఛానల్ ఫాలో అవ్వండి
ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ కలల సాకారానికి తాను సాక్షినని అన్నారు. నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వాజ్‌పేయికి నివాళులు
ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయి విజన్ కారణంగానే 25 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ ఏర్పాటయిందని మోదీ గుర్తుచేసారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందని, మాజీ ప్రధాని కలలు సాకారమయ్యాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు