నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాం.. బీజేపీ ఎంపీకి బెదిరింపులు
యూ.పీ, 1 నవంబర్ (హి.స.) నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపేస్తామంటూ ఏకంగా ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు రవికిషన్ పీఏ శివమ్ ద్వి
ఎంపీకి బెదిరింపులు


యూ.పీ, 1 నవంబర్ (హి.స.)

నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపేస్తామంటూ ఏకంగా ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు రవికిషన్ పీఏ శివమ్ ద్వివేదికి ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. యాదవుల గురించి ఎంపీ రవికిషన్ మాట్లాడితే తుపాకీతో కాల్చి చంపేస్తానని.. అయన చేస్తున్న అన్ని పనులు తమకు తెలుసని అన్నాడు. ఎన్నికల్లో ప్రచారం భాగంగా నాలుగు రోజుల్లో బీహార్కు వచ్చినప్పుడు అతడిని హతమార్చుతామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఎంపీ పీఏ తాము ఏ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సర్దిచెప్పినా.. అపరిచిత వ్యక్తి అతడిపై దురుసు భాషతో విరుచుకుపడ్డాడు. అయితే, పీఏకు చేసిన వ్యక్తి బిహార్ రాష్ట్రంలో ఆరా జిల్లా జవానియా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ యాదవ్ తెలుస్తోంది. కాగా, బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రవికిషన్కు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande