జల సంరక్షణ ప్రాజెక్టులలో తొలిస్థానంలో తెలంగాణ.. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB)1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష
సిఆర్ పాటిల్


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ

తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB)1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4.05 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్ గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్య ప్రాజెక్టులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు.

జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ది రెయిన్ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డులను అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande