
అమరావతి, 27 జూలై (హి.స.)
గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘోర ఓటమి చెందినా ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజలతో నిత్యం మాట్లాడుతూ ఉంటే గొడ్డలి పార్టీ కుట్రలను బహిర్గతం చేయవచ్చన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, ఇది అగ్రస్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై సోమవారం నుంచి 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘ఓట్లేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ