
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
తెలంగాణలో విభజన రాజకీయాలతో గెలవలేం అని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కులం, మతం ప్రాతిపదికగా ఎక్కడా రాజకీయాలు నిలబడవు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టారు.. గతంలో కేసీఆర్ పనినే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు.. ఇద్దరికీ తేడా ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ గతంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా డిపాజిట్ కోల్పోయింది.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దు అని హితవు పలికారు.
అయితే.. తాజాగా మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవు అని ఈటల కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు