
గోదావరిఖని, 17 నవంబర్ (హి.స.)
రాజీవ్ రహదారిపై ప్రమాదాల
నివారణకు స్థలాలను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రామగుండం సీపీ అంబటి కిషోర్ జూ ఆదేశించారు. సోమవారం రాజీవ్ రహదారిపై ప్రమాదాలు జరిపే చోటును గుర్తించి ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన అరైవ్, అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్మన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు