
భద్రాద్రి కొత్తగూడెం, 2 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఫర్నిచర్ ను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేసి పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తమ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్యని, సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకుల ఆందోళనలతో మణుగూరు పట్టణమంతా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు ఆందోళనలు అడ్డుకుంటూ మరోపక్క ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో మణుగూరు, బయ్యారం, అశ్వాపురం సిఐలు, ఎస్సైలు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు