
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)
పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుపుతూ, పెద్దల ఇళ్లకు మాత్రం చుట్టంలా మారిందని రేవంత్ సర్కార్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాన్యులపై కర్కశ చర్యలు, అధికార వర్గాలపై సహన వైఖరి ప్రదర్శించడం రేవంత్ ప్రభుత్వానికి తగదని ఆయన మండిపడ్డారు. 'సామాన్యుల ఇళ్లు నిరాక్షిణ్యంగా కూల్చివేస్తూ, బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువులు ఇస్తున్న రేవంత్ సర్కారు ఇదేనా ప్రజాపాలన?' అని ప్రశ్నించారు. '15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లు నేలమట్టం చేశారు. కానీ అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోలేదు' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు