కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందజేత
కాశీబుగ్గ: 2 నవంబర్ (హి.స.)శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల క
కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందజేత


కాశీబుగ్గ: 2 నవంబర్ (హి.స.)శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కార్తిక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో ఉదయం 11.45 గంటలకు తోపులాట జరిగి.. అది తొక్కిసలాటకు దారితీసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande