కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయిస్తా: కోమటిరెడ్డి
నల్గొండ, 2 నవంబర్ (హి.స.) మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ ర
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


నల్గొండ, 2 నవంబర్ (హి.స.)

మునుగోడు నియోజకవర్గంలోని

ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. జనవరిలో మొదలైన ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణలో భాగంగా నియోజకవర్గంలోని చౌటుప్పల్లో ఆదివారం పదవ శిబిరం నిర్వహించారు. ఇంతవరకు నిర్వహించిన మొత్తం

తొమ్మిది ఉచిత కంటి వైద్య శిబిరాలలో 6618 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1330 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేయించారు. ఆదివారం పదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌటుప్పల్ మండలం లక్కారం ఓ ప్రైవేటు పాఠశాలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande