
నల్గొండ, 2 నవంబర్ (హి.స.)
పత్తికి మద్దతు ధర చెల్లించి రైతులను
ఆదుకునేందుకే ప్రభుత్వం సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసిందని నకరికల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో గల ప్రగతి కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసి దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసి సరైన మద్దతు ధర అందించేందుకు కృషి చేస్తుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు