వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని తమ్ముడు రాము నివాసాల్లో సిట్ సోదాలు
ఇబ్రహీంపట్నం: , 2 నవంబర్ (హి.స.) వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ , ఆయన సోదరుడు రాము నివాసాల్లో సిట్‌ సోదాలు నిర్వహించింది. నకిలీ మద్యం తయారీ కేసు విచారణలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. సిట్‌, ఎక్సై
వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని తమ్ముడు రాము నివాసాల్లో సిట్ సోదాలు


ఇబ్రహీంపట్నం: , 2 నవంబర్ (హి.స.) వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ , ఆయన సోదరుడు రాము నివాసాల్లో సిట్‌ సోదాలు నిర్వహించింది. నకిలీ మద్యం తయారీ కేసు విచారణలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. సిట్‌, ఎక్సైజ్‌, పోలీస్‌, క్లూస్‌టీంలతో కూడిన బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. పలు హార్డ్‌ డిస్క్‌లను సిట్‌ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను ఆదివారం ఉదయం సిట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి ఆయన్ను తరలించి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసంలో సోదాలు జరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande