
నెల్లూరు,, 2 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు.. సముద్రంలో గాలించి మృతదేహాలని వెలికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ