జగన్ పర్యటనలో పోలీసులతో వాగ్వాదం... వైసీపీ నేతలపై కేసు నమోదు
అమరావతి, 5 నవంబర్ (హి.స.)పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కైలే అనిల్ కుమార్‌తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణ
జగన్ పర్యటనలో పోలీసులతో వాగ్వాదం... వైసీపీ నేతలపై కేసు నమోదు


అమరావతి, 5 నవంబర్ (హి.స.)పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కైలే అనిల్ కుమార్‌తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు.

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

కేసు వివరాల్లోకి వెళితే, నిన్న జగన్ పర్యటనలో భాగంగా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సీఐ చిట్టిబాబు వైకాపా నేతలను కోరారు. అయితే, ఆ సమయంలో కైలే అనిల్ కుమార్, ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఇష్టప్రకారం చేస్తామంటూ పోలీసుల సూచనలను తోసిపుచ్చినట్టు ఆరోపణ.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్‌ను పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా వాగ్వాదానికి దిగిన మిగతా వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తామని సీఐ చిట్టిబాబు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande