దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత : ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
అమరావతి, 5 నవంబర్ (హి.స.) ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) అప్రమత్తమయ్యారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కమిషనరేట్ పర
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు


అమరావతి, 5 నవంబర్ (హి.స.) ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) అప్రమత్తమయ్యారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలోని దేవాలయాల (Temples) వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

కార్తీక పౌర్ణమి (Karthika Pournami) కావడంతో జిల్లా పరిధిలోని దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు తరలి వస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తిశ్రద్దలతో కార్తీక పూజలు చేసుకునేందుకు పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లను చేశారు. బెల్ హెల్లర్స్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలను అందించారు. రద్దీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. డ్రోన్ల సహాయంతో భక్తుల రద్దీని ఎయిర్ వ్యూలో పరిశీలించారు. భక్తుల భద్రతకు (Devotees Security) అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande