
నాగర్ కర్నూల్, 6 నవంబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం మెగా హెల్త్ క్యాంపులో పాల్గొంటున్నారని, వారందరికీ పాలమూరు ఎస్వీఎస్ మెడికల్ కళాశాల, సీబీఎం ట్రస్ట్ సౌజన్యంతో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహల సూచనలు మేరకు గతంలో నిర్వహించిన సర్జికల్ క్యాంపులో 1467 మందికి ఆపరేషన్లు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు