తెలుగు రాష్ట్రాల్లో. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు
పార్వతీపురం, 6 నవంబర్ (హి.స.:తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్
తెలుగు రాష్ట్రాల్లో. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు


పార్వతీపురం, 6 నవంబర్ (హి.స.:తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను మరువక ముందే రాష్ట్రంలోని పలు చోట్ల బస్సు ప్రమాదాలు జరిగాయి. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా పార్వీతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో కాలిబూడిదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande