మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన
సంగారెడ్డి జిల్లా :, 6 నవంబర్ (హి.స.) అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే *మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన* మంగళవారం రోజున చ
Dfg


సంగారెడ్డి జిల్లా :, 6 నవంబర్ (హి.స.)

అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే *మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన* మంగళవారం రోజున చోటు చేసుకుంది. సిఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల కు చిందం శ్రీకాంత్ (35) తో 2022 సంవత్సరంలో వివాహం జరిగినది. వారికి అన్నికా (3) కూతురూ ఉంది.(మైర్మోకోఫోబియా)అనే వ్యాధి వల్లన మనిషకు చిన్నప్పుడు నుండి చీమలు అంటే భయం ఉన్నట్లు తెలిపారు. అయితే భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో మనీషా ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ లోపల నుండి గడి పెట్టి ఉండడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా మనిషా ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. మనీషా ఒక పేపర్లో ఐయాం సారీ అన్ని జాగ్రత్త అన్నవరం,తిరుపతి హుండీలో 1116 రూపాయలు వేయాలని అలాగే ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్న మనీషా. ఘటన స్థలానికి అమీన్ పూర్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande