
సిద్దిపేట, 6 నవంబర్ (హి.స.)
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన
భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమవతి సూచించారు. గురువారం కుకునూరు పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత పరిశీలిస్తూ నాణ్యత పెంచాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో పిల్లల హాజరు ప్రకారం బియ్యం వంట సరుకులు అందించాలని వంట ప్రక్రియను తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాల లోపల వరండాలో, బయట మైదానంలో శుభ్రంగా లేదని పాఠశాల ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఏం డ్యూటీ చేస్తున్నారని హెడ్ మస్టర్ పైన స్కావెంజర్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసి యాక్షన్ తీసుకోవాలని డి ఈ ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు