ఢిల్లీలో అధ్వానస్థితిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
ఢిల్లీ, 8 నవంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలో నమోదవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది.
ఢిల్లీ పొల్యూషన్


ఢిల్లీ, 8 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో వాయు

కాలుష్యం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలో నమోదవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. శనివారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 355గా నమోదైంది.

కాలుష్య స్థాయిలు తీవ్రస్థాయిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande