
న్యూఢిల్లీ, 8 నవంబర్ (హి.స.)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక కారణాలతో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 800కు పైగా విమానాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. అయితే, సాంకేతిక సమస్య సంభవించిన దాదాపు 36 గంటల తర్వాత ఇప్పుడు విమాన కార్యకలాపాలు క్రమంగా మెరుగుపుడుతున్నాయి. నిన్న 800 విమానాలు ఆలస్యం కాగా.. శనివారం ఉదయానికి ఆ సంఖ్య 129కి తగ్గింది. అందులో 53 విమానాలు ఢిల్లీకి రావాల్సినవి కాగా, 76 విమానాలు ఢిల్లీ నుంచి వెళ్లాల్సినవి ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు