వాట్సప్ వెబ్ నందు పనిచేయని మెసేజ్ ఫార్వర్డ్ ఆప్షన్.. మధ్యాహ్నం కల్లా పునరుద్ధరణ
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగం అయిపోయింది. ప్రస్తుతం ఇండియాలో 853.8 మిలియన్ల మంది ప్రజలు వాట్సప్ ను వినియోగిస్తున్నారు. ఆఫీసుల్లో ప్రతీసారి మొబైల్ నుంచి మెసేజ్ చేయడం ఇబ్బంది కాబట్టి ఎక్కువగా వెబ్ వా
మెసేజ్ ఫార్వర్డ్ వాట్సాప్


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగం అయిపోయింది. ప్రస్తుతం ఇండియాలో 853.8 మిలియన్ల మంది ప్రజలు వాట్సప్ ను వినియోగిస్తున్నారు.

ఆఫీసుల్లో ప్రతీసారి మొబైల్ నుంచి మెసేజ్ చేయడం ఇబ్బంది కాబట్టి ఎక్కువగా వెబ్ వాట్సప్ ను వాడుతుంటారు. ఒక మెసేజ్ ను ఒకేసారి బల్క్ గా ఫార్వర్డ్ చేసే ఆప్షన్ వాట్సప్ లో ఉంటుంది. కానీ.. ఉదయం నుండి ఆ ఆప్షన్ పనిచేయట్లేదు. మొబైల్ వెర్షన్ లో మెసేజ్ ఫార్వర్డ్ పనిచేస్తుంది కానీ.. వెబ్ వాట్సప్ లో ఉదయం నుంచి ఈ ఆప్షన్ పనిచేయలేదు. ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా ? లేక ఆ సంస్థ యాజమాన్యమే వెబ్ వాట్సప్ లో ఈ ఆప్షన్ ను ఆపేసిందా ? అని వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే మధ్యాహ్నం నుంచి వాట్సప్ యాజమాన్యం ఈ ఆప్షన్ ను పునరుద్ధరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande