షట్ డౌన్ తో విమాన సేవల్లో కోత.. అమెరికా వ్యాప్తంగా ఒక్కరోజే వెయ్యికిపైగా ఫ్లైట్స్ రద్దు
ఢిల్లీ, 8 నవంబర్ (హి.స.) అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్ డౌన్ గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్ డౌన్ తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మరియు దీంతో దేశంలో
అమెరికా షట్ డౌన్


ఢిల్లీ, 8 నవంబర్ (హి.స.) అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్ డౌన్ గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్ డౌన్ తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మరియు దీంతో దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. షట్ డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి.

పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవల్లో కోత విధించింది. ఈ విషయాన్ని దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఇటీవలే ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే అట్లాంటా, న్యూవార్క్, డెన్వర్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ సహా 40 ప్రాంతాల్లో 10 శాతం విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. దీనిని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే దేశంలో 1000కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ట్రాకింగ్ వెబ్సైట్ FlightAware ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా 1,200 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది గురువారం కంటే ఐదు రెట్లు ఎక్కువ. రేగన్ జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. 18శాతం అంటే 81 విమానాలు రద్దయ్యాయి. షికాగో ఓ హేర్, అట్లాంటా, డల్లాస్, డెన్వర్ వంటి కేంద్రాల్లో కూడా 3% వరకు విమానాలు రద్దయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande