
హుజురాబాద్, 19 డిసెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని
శంకరపట్నం మండలం
మొలంగూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఎనిమిదవ వార్డులోని ఓటర్లపై పోటీ చేసి ఓడిపోయిన వార్డు సభ్యురాలి కుటుంబ సభ్యులు దాడి చేయగా.. బాధితులు కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదుపై హుజురాబాద్ ఏసీపీ మాధవి శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులైన దాసరి మొగిలి కుటుంబ సభ్యులైన పద్మ, ప్రియాంకలను ఏసిపి విచారించారు. విచారణ సమయంలో ఏసీపీ వెంట కేశవపట్నం ఎస్ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు