
వనపర్తి, 19 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల
వెన్నుపోటు రాజకీయాల వల్ల కాంగ్రెస్ జండా మోసిన కార్యకర్తలకు నష్టం వాటిల్లిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి మండిపడ్డారు. స్థానిక నంది హిల్స్ లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గం పరిధిలో ని 141 గ్రామపంచాయతీ స్థానాలకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రెండేళ్ల కాంగ్రెస్ పాలన పై ప్రజలు తమ సంతృప్తిని ఓటు రూపంలో తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను తమ మద్దతు తెలిపిన ఓటర్లకు,ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు 51 శాతం బీసీ వర్గాలకు కేటాయించామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు