యూనియన్ సభకు రావాలంటూ మంత్రి తుమ్మలకు జర్నలిస్టుల ఆహ్వానం
ఖమ్మం, 19 డిసెంబర్ (హి.స.) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మంలో శనివారం నిర్వహించే యూనియన్ జిల్లా మహాసభలకు తాను హాజరవుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. ఖమ్మం జిల్లా గండుగులపల్లి లోని మంత్రి నివాసం క్యాంప
మంత్రి తుమ్మల


ఖమ్మం, 19 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్

ఖమ్మంలో శనివారం నిర్వహించే యూనియన్ జిల్లా మహాసభలకు తాను హాజరవుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. ఖమ్మం జిల్లా గండుగులపల్లి లోని మంత్రి నివాసం క్యాంపు కార్యాలయంలో యూనియన్ నేతలు మంత్రికి శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆహ్వాన పత్రికలో భాగంగా పేర్కొన్న జర్నలిస్టుల డిమాండ్లను పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande