తూర్పు గోదావరి.జిల్లా లోని.గోపాలపురం నియోజకవర్గం లో. వైయస్ఆర్.కాంగ్రెస్ పార్టీ కి.భారీ షాక్
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.) తూర్పుగోదావరి, జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశ
తూర్పు గోదావరి.జిల్లా లోని.గోపాలపురం నియోజకవర్గం లో. వైయస్ఆర్.కాంగ్రెస్ పార్టీ కి.భారీ షాక్


అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)

తూర్పుగోదావరి, జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోపాలపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం, నియోజవర్గ ఇన్‌చార్జ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ ఇష్యూ కాస్తా చిలికిచిలికి గాలి వానగా మారింది. పార్టీ నాయకులు.. మండల స్థాయి నేతలను, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను పట్టించుకోవడంలేదని అలక వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande