
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)
పెనుకొండ, సోమందేపల్లి, : ఓ చిరుత పెనుకొండ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జీఐసీ కాలనీలో గత శనివారం ఓ పశువుల పాకలో ఉన్న మూడు గొర్రెలను హతమార్చింది. మరుసటిరోజున పెనుకొండ శివారులోని మామిడితోటలో సంచరించింది. సాయంత్రం నడకకు వెళ్లిన స్థానికులకు కనిపించడంతో పరుగులు తీశారు. మూడు రోజుల క్రితం సోమందేపల్లి మండలం చాలకూరు-మరకుంటపల్లి గ్రామాల మధ్య రహదారిపై కారులో వెళుతున్న వారి కంటపడింది. కారు సమీపానికి వచ్చినతీరు చరవాణిలో వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ప్రజలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ