
నెల్లూరు, 21 డిసెంబర్ (హి.స.)వైసీపీ)కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిమరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇరిగేషన్ విభాగంలోని ఇన్‌చార్జి ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డిలు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈక్రమంలో ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ