
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..