
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అదే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..