ఫామ్హహౌజ్లో చలి ఎక్కువై కేసీఆర్ బయటకొచ్చారు.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్లో చలి ఎక్కువైందని.. అందుకే కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. తాము
మధు యాస్కిగౌడ్


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం

కేసీఆర్ పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్లో చలి ఎక్కువైందని.. అందుకే కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. తాము ప్రతిపక్షం ఉండొద్దని ఏనాడూ కోరుకోలేదని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకున్నామని అన్నారు. కానీ.. కేసీఆరే ఫామహౌజ్కు పరిమితం అయ్యారని తెలిపారు. తెలంగాణ నేల.. కేసీఆర్కు, ఆయన కుటుంబానికి చాలా ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని ఎద్దేవా చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande