పేద ప్రజల పాలిట కల్పవృక్షం ఉపాధి హామీ పథకం..ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ, 21 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో స్వర్ణయుగం ఉన్నదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ
MLA naini


హనుమకొండ, 21 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో స్వర్ణయుగం ఉన్నదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక సంక్షేమ పథకం కాదు, ఇది చట్టబద్దమైన హక్కు అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గాయి, స్థానికంగా ఉపాధి కల్పన జరిగిందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande