
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి,
బిఎన్పి (BNP) అధినేత్రి బేగమ్ ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం వద్ద పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వయంగా ఢాకాకు చేరుకుని, భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఖలీదా జియా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ సమాధి చెంతనే ఆమె పార్థివ దేహాన్ని ఖననం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..