హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది..
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు. శాస్త్రీయ పద్దతి
హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది..


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కులగణన చేయలేదు.. అబాసు పాలు అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్.. 317 జీవోతో ఉద్యోగులకు మోసం చేశాడని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ పై ప్రజలకు విరక్తి రాలేదు.. కానీ 9 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం.. ఎవ్వరు గెలిచినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. అందుకే రీసర్వే చేస్తున్నారని ఈటల ఆరోపించారు. టీచర్ల సమస్యలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ అని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. ప్రపంచంలో దేశం ముందు ఉండాలి అంటే బీజేపీకి ఓటు వేయండని ఈటల రాజేందర్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande