చందానగర్ పరిధిలోని గంగారం పెద్దచెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) హైదరాబాద్ చందానగర్ పరిధిలోని గంగారం పెద్దచెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్దచెరువులో ఐదు ఎకరాలు కబ్జాకు గురైందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శించిన విషయం త
హైడ్రా కమిషనర్ రంగనాథ్.


హైదరాబాద్, 20 మార్చి (హి.స.) హైదరాబాద్ చందానగర్ పరిధిలోని గంగారం పెద్దచెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్దచెరువులో ఐదు ఎకరాలు కబ్జాకు గురైందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంతో గురువారం ఉదయం పెద్దచెరువును రంగనాథ్ పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande