విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స):జమ్మూకశ్మీర్‌లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబాన్ జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. సుమారు 200 మందిని సహాయక సిబ్బంది రక్షించింది. నశ్రీ, బనిహాల్ మధ్య సుమారు డజను ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను రద్దు చేసారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల