హైదరాబాద్, 11 మే (హి.స.)
మీరు ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా..? తెలంగాణ కులగణనపై ఎంపీ లక్ష్మణ్ అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా సర్వే నిర్వహించామని తెలిపారు. మహారాష్ట్రలో బీసీ కుల గణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని, బీహార్ లో కుల గణన చేపట్టి ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు. జార్ఖండ్లోలో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ను జైల్లో వేశారని, అటువంటి చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్