మల్లన్న సేవలో తెలంగాణబ్రస్త్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
శ్రీశైలం, 14 మార్చి (హి.స.) : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ
మల్లన్న సేవలో తెలంగాణబ్రస్త్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా


శ్రీశైలం, 14 మార్చి (హి.స.)

: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గవర్నర్ దంపతులకు దేవస్థానం అర్చకులు, పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో వారికి స్వామి అమ్మ వార్ల చిత్రపటాలను అందజేశారు. శ్రీశైల క్షేత్ర విశేషాల గ్రంథాన్ని గవర్నర్కు ఈవో బహూకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande