నెల్లూరు.ప్రకాశం జిల్లా.సరిహద్దులో రోడ్డు ప్రమాదం అన్నదమ్ముల మృతి
అమరావతి, 14 మార్చి (హి.స.) కావలి: పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు తెట్టుకు ఆటోల
నెల్లూరు.ప్రకాశం జిల్లా.సరిహద్దులో రోడ్డు ప్రమాదం అన్నదమ్ముల మృతి


అమరావతి, 14 మార్చి (హి.స.)

కావలి: పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు తెట్టుకు ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో మోచర్ల సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకశిరి రాములు అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములు సోదరుడు వెంకయ్య మృతి చెందారు. ఆటో డ్రైవర్ సుల్తాన్ బాషా, ఏకశిరి పోలయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande