భూపాలపల్లి జిల్లాలో బావిలో.క్రేన్ పడి ముగ్గురి మృతి
భూపాలపల్లి, 14 మార్చి (హి.స.) బావిలో క్రేన్ పడిపోయి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా.. ప్రమాదవశాత్తు వైరు తెగి క్రేన్ బావిలో పడిపోయింది. దీ
భూపాలపల్లి జిల్లాలో బావిలో.క్రేన్ పడి ముగ్గురి మృతి


భూపాలపల్లి, 14 మార్చి (హి.స.)

బావిలో క్రేన్ పడిపోయి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా.. ప్రమాదవశాత్తు వైరు తెగి క్రేన్ బావిలో పడిపోయింది. దీంతో కొరికిశాలకు చెందిన దేవారావు, అభిలాష్, పిడిసిల్ల వాసి పైడయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande