విజయనగరం జిల్లా బాదంగిలో ఈగల్ టీమ్ అధికారులు 490 మంది. పోలీసులతో తనికీలు
విజయనగరం, 14 మార్చి (హి.స.) జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున బొబ్బిలి సబ్ డివిజన్ పరిధి బాడంగి పోలీసు స్టేషన్ సమీపంలో ఈగల్ టీం అధికారులు సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 800 ఇళ్లలో సోదాలు ని
విజయనగరం జిల్లా బాదంగిలో  ఈగల్ టీమ్  అధికారులు 490 మంది. పోలీసులతో తనికీలు


విజయనగరం, 14 మార్చి (హి.స.) జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున బొబ్బిలి సబ్ డివిజన్ పరిధి బాడంగి పోలీసు స్టేషన్ సమీపంలో ఈగల్ టీం అధికారులు సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 800 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గ్రామంలో అనుమతులు లేని బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని నాలుగు మోటారు సైకిళ్లు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేసి సంబంధిత పోలీసు స్టేషన్కు తరలించారు.

ఈ సోదాల్లో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డెన్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆపరేషన్లో బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్, బాడంగి ఎస్సై తారకేశ్వరరరావు, రామభద్రపురం ఎస్సై ప్రసాద్, తెర్లాం ఎస్సై సాగర్ బాబు, బొబ్బిలి టౌన్ ఎస్సై ఎస్ జ్ఞాన ప్రసాద్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande